తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వైవిధ్య చిత్రాల  దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు కృషి జాగర్లమూడి. 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్', గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె లాంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ నిజజీవిత పాత్రలకు దగ్గరగా ఉంటాయి. అందుకే ఈయన సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా దాన్ని తక్కువ సమయంలోనే పూర్తి పూర్తి చేస్తాడు క్రిష్.

 బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ ని కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఇక ఇటీవలే వైష్ణవ్ తేజ్ తో 'కొండపొలం' సినిమాని తెరకెక్కించి మరోసారి తనలోని స్పీడ్ ని ప్రూవ్ చేశాడు ఈ దర్శకుడు. కొండపొలం అనే ఓ నవలను ఆధారంగా చేసుకొని దాన్ని సినిమాగా తెరకెక్కించాడు. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో,హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశాడు క్రిష్.  ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కరోనా సమయంలోనే పూర్తి చేశారు.

 ఆ సమయంలో షూటింగ్ కి పర్మిషన్ లేకున్నా అతి తక్కువ మంది సాంకేతిక నిపుణులతో షూటింగ్ పూర్తి చేశాడు. అటవి నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రాన్ని ఎక్కువగా వికారాబాద్ అడవుల్లో ని చిత్రీకరించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయినా.. డైరెక్టర్ క్రిష్ టేకింగ్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం క్రిష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: