ఏంటి నిహారికకు కుటుంబంతో కలిసి ఉండడం లేదా.. పెళ్లయి విడాకులు తీసుకున్న నిహారిక తల్లిదండ్రులతో కలిసి ఉండకుండా వేరుగా ఎందుకు ఉంటుంది.. లావణ్య త్రిపాఠి వచ్చాక ఈ గొడవలు జరిగాయా.. ఎందుకు నిహారిక ఇంటి నుండి బయటికి వెళ్లిపోయి వేరే ఇంట్లో వేరు కుంపటి పెట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత వరుస సినిమాల్లో దూసుకుపోతోంది. ఓవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా కూడా నటిస్తోంది.ఇక ఆ మధ్యకాలంలో వచ్చిన మద్రాస్ కారన్ సినిమాలో ఈ బ్యూటీ చాలా బోల్డ్ గా నటించి మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక నేను మా ఇంట్లో వాళ్లకి దూరంగా వేరే ఇంట్లో ఉంటున్నాను అని చెప్పింది.

ఇక ఈ విషయం చెప్పడంతోనే చాలామంది రెటిజెన్లు నిహారిక చెప్పిన మాటలను వైరల్ చేస్తూ నిహారికకు ఇంట్లో వాళ్లతో గొడవలు జరిగాయి.. అందుకే కలిసి ఉండడం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు.ఇక మరికొంత మందేమో ఎప్పుడైతే లావణ్య త్రిపాఠి నాగబాబు ఇంట్లోకి అడుగు పెట్టిందో అప్పటినుండి లావణ్య నిహారిక కి చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు రావడంతో నిహారిక ఇంటినుండి బయటికి వెళ్లిపోయింది అనే రూమర్లు కూడా క్రియేట్ చేస్తున్నారు.కానీ ఇవన్నీ రూమర్లే.ఎందుకంటే నిహారిక ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టింది. నేను మా ఇంట్లో ఉండడం లేదు. వేరుగా ఉంటున్నాను. అలా అని అమ్మానాన్నలను చూడకుండా రెండు రోజులు కూడా ఉండలేను.

అలా రెండు రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాను. ఇక నాకు అల్లుడు పుట్టినప్పటి నుండి పొద్దస్తమానం వాడిని ఎత్తుకునే కూర్చుంటున్నాను. ఎందుకంటే వాడిని ఎత్తుకుంటే నాకు ఎవరు ఏ పని చెప్పరు.ఖాళీగా ఉంటే ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని విసిగిస్తారు.అందుకే పని తప్పించుకోవడానికి వాడిని ఎత్తుకొని కూర్చుంటా. అలాగే వాడు పెద్దయ్యాక హీరో అవుతానంటే కచ్చితంగా నా బ్యానర్ లోనే వాడిని హీరోగా పరిచయం చేస్తా. ఇక ఇంట్లో వాళ్లకు దూరంగా ఉన్నా సరే రెండు రోజులకు ఒకక్కసారైనా కచ్చితంగా వచ్చి కలుస్తా.ఎందుకంటే వాళ్లే నా సర్వస్వం. ఇక మంచి సినిమా వస్తే హీరోయిన్ గా చేయాలని చూస్తున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి: