తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ నుండి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు తన ఫ్యామిలీ నుండి ఫస్ట్ టైం ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు. దిల్ రాజు పార్ట్ నర్ శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా రౌడీ బాయ్స్ సినిమా వచ్చింది. హర్ష డైరక్షన్ లో యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో యూత్ ఆడియెన్స్ టార్గెట్ తోనే రోఉడీ బాస్ తెరకెక్కింది. సినిమాలో అందాల భామ అనుపమ లిప్ లాక్, హాట్ సీన్స్ కొంత మేర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంట్లో హీరోనే కాబట్టి ఆశిష్ కోసం భారీ బడ్జెట్ తో సినిమా తీశాడు దిల్ రాజు. సినిమా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రాగా ఐదు రోజుల్లో నాలుగున్నర కోట్ల షేర్ రాబట్టిందని టాక్.

ఇక ఇదిలాఉంటే ఆశిష్ సెకండ్ సినిమా కూడా లైన్ లో పెట్టారట దిల్ రాజు. సుకుమార్ సహకారంతో అతని నిర్మాణంలో నూతన దర్శకుడు కాశీ డైరక్షన్ లో ఈ మూవీ ఉండబోతునని టాక్. ఈ సినిమాకు కాశీ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఆర్య తరహాలో ఉంటుందని లేటెస్ట్ టాక్. అల్లు అర్జున్ కెరియర్ లో ఆర్య మూవీ కెరియర్ చేంజ్ మూవీ అని తెలిసిందే. సుకుమార్ డైరక్షన్ లో బన్నీని ఆర్యగా యూత్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేశారు. అయితే ఆశిష్ కోసం అలాంటి యూత్ ఫుల్ కథతో రావాలని చూస్తున్నారట దిల్ రాజు.

ఫ్యామిలీ హీరోని ఎలాగైనా స్టార్ హీరోని చేయాలని తన దగ్గరకు వచ్చిన సూపర్ హిట్ కథలని ఇంక మీదట ఆశిష్ కోసం అలా లైన్ లో పెట్టాలని చూఒస్తున్నారట దిల్ రాజు. ఇన్నాళ్లు మంచి కథ వస్తే దానికి తగిన హీరో కోసం వెతికిన రాజు గారు ఇప్పుడు ఇంట్లో హీరో ఉన్నాడు కాబట్టి హిట్ కథ వస్తే మాత్రం అతనితోనే తీసే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: