ఇక సమంత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోన్న 'యశోద' సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2022 ఆగస్టు 12 వ తేదీన తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ మేరకు మంగళవారం నాడు అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా వదిలారు.అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..అక్కినేని బ్రదర్స్  తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య ఇంకా అతని సోదరుడు అఖిల్ చిత్రాలకు పోటీగా సమంత సినిమా విడుదల కాబోతోంది.ఇక  చైతూ బాలీవుడ్ ఫస్ట్ మూవీ 'లాల్ సింగ్ చద్దా' ను పలు వాయిదాల తరువాత 2022 ఆగస్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.అమీర్ ఖాన్ ఇంకా కరీనా కపూర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో కలిసి నాగచైతన్య నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 



అంటే నాగ చైతన్య మూవీ వచ్చిన ఒక రోజు తర్వాత సమంత నటించిన 'యశోద' మూవీ కూడా థియేటర్లోకి రాబోతోందన్నమాట.ఇకపోతే అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ''ఏజెంట్''. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని 2022 ఆగస్ట్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఇక ఇప్పుడు అదే రోజున సమంత సినిమా కోసం షెడ్యూల్ చేయబడింది.దీంతో ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలతో సమంత పోటీ పడి ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలయ్యే సినిమాలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: