పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి, తిరిగి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకిల్ సాబ్  సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.  వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో వకీల్ సాబ్ మూవీ ఇచ్చిన జోష్ లో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఓకే చేస్తూ వచ్చాడు.  పవన్ కళ్యాణ్ అందులో భాగంగా భీమ్లా నాయక్ మరియు హరిహర వీరమల్లు సినిమాలను దాదాపుగా ఒకేసారి ప్రారంభించాడు.  

కాకపోతే పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాపై కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం,  అలాగే హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా కొండపొలం సినిమాను తెరకెక్కించడంతో హరిహర వీరమల్లు మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి వాయిదా పడింది.  ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇప్పటికే విడుదల కావడం,  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కొండపొలం సినిమా పనులు ముగియడంతో తిరిగి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది.  

హరిహర వీరమల్లు మూవీ తాజా షెడ్యూల్ ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.  ఈ షెడ్యూల్ లో భాగంగా సినిమా లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ఐదు నెలలు కేటాయించిన పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లు'  సినిమా పూర్తి అయ్యేదాకా ఏ సినిమా షూటింగ్ లో  పాల్గొన్నారు అని చాలా మంది భావించారు.  కాకపోతే పవన్ కళ్యాణ్ జూలై ఎండింగ్ వరకు మాత్రమే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత వినోదాయ సితం , థేరీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశం లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ రెండు రీమేక్ సినిమాల కోసం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: