
అంతేకాదు ఇక రాజమౌళి సినిమాలలో చిన్న పాత్రలు అవకాశం వచ్చినా చాలు అనే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా భావిస్తూ ఉంటారు. అందుకే జక్కన్న సినిమా అవకాశం తలుపుతట్టింది అంటే చాలు ఇక కథ కూడా వినకుండానే పాత్రకు ఓకే చెప్పేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎందుకంటే నటీనటులు అందరికీ కూడా రాజమౌళి పై రాజమౌళి ఎంచుకునే కథల పై అంత నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక హీరోయిన్ రాజమౌళి సినిమాలో కీలక పాత్ర అవకాశం వస్తే వదులుకుందట. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ స్వయంగా చెప్పుకొచ్చింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు అర్చన. ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది అర్చన.. నాగార్జున హీరోగా నటించిన శ్రీ రామదాసు సినిమాలో సీత పాత్రలో కనిపించి తన అభినయంతో ఆకట్టుకుంది అనే విషయం తెలిసిందే. ఇక తెలుగు బిగ్బాస్ కార్యక్రమంలో అటు కంటెస్టెంట్ గా కూడా వెళ్లి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది అర్చన. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యామదొంగ సినిమాలో నటించారు కానీ మగధీర సినిమాలో పాత్ర చేయమంటే రిజెక్ట్ చేశారట కదా ఎందుకు అని ప్రశ్నించగా అప్పుడు ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలని మెచ్యూరిటీ లేదు అందుకే రిజెక్ట్ చేశాను కానీ ఆ పాత్ర చేసి ఉంటే తన కెరియర్ మరోలా ఉండేది అంటూ అర్చన చెప్పుకొచ్చింది..