
అయితే కెరీర్ మొదట్లోనే మలయాళ కన్నడ తమిళ సినిమాలలో నటించింది విష్ణుప్రియ.. కానీ అక్కడ మాత్రం క్లిక్ అవ్వ లేకపోయింది. దీంతో టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇక్కడికి వచ్చేసింది. కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అవకాశాలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది. పొట్టి పొట్టి డ్రెస్సులలో కనిపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. అయితే ఎన్నో రోజుల తర్వాత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకుంది విష్ణుప్రియ.
కాగా ఇటీవలే సినిమా బృందం ప్రమోషన్స్ లో భాగంగా సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో పాల్గొన్నారు. కే రాఘవేంద్ర రావు, అనసూయ, నిత్య శెట్టి, విష్ణుప్రియ, యశ్వంత్ మాస్టర్ గెస్ట్ గా వచ్చారు.. అయితే క్యాష్ షో లో భాగంగా గేమ్ ఆడటానికి విష్ణుప్రియ కు రెండు యాపిల్స్ ఇచ్చారు. శ్రావణమాసంలో నాకు రెండు పళ్ళు ఇచ్చారు. పెళ్లయిన తర్వాత పళ్ళతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేసింది విష్ణు ప్రియ. అయితే పరోక్షంగా విష్ణు ప్రియ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిందని కొందరు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే రాఘవేంద్రరావు విష్ణుప్రియాకు బొకే విసురుతాడు. విష్ణు ప్రియ పట్టుకుని హమ్మయ్య నా పెళ్లి అయిపోయినట్లే అని అంటుంది. అంతలో మరో బొకే విసరగా ఎస్ఎస్ రెండు పెళ్లి అని నోరు జారుతుంది విష్ణు ప్రియ.