టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత గీత గోవిందం , టాక్సీ వాలా మూవీ విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోయిన విజయ్ దేవరకొండ  ఆ తర్వాత నోట , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లు అన్ని భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ మూవీ లు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాయి. ఈ సినిమాలలో డియర్ కామ్రేడ్ సినిమా కొంత మేరకు ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ ఆఖరుగా వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా, మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. రమ్యకృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఆగస్ట్ 25 వ తేదిన ఈ మూవీ విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందని లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: