బాలీవుడ్ ఇండస్ట్రీలో యువ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సంవత్సరం రన్బీర్ కపూర్ 'షంషేర' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన షంషేర మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా షంషేర మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన రన్బీర్ కపూర్ మరి కొన్ని రోజుల్లో బ్రహ్మాస్త్రం అనే భారీ బడ్జెట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మూవీ లో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించాడు. మూడు భాగాలుగా తెరకెక్కనున్న బ్రహ్మాస్త్రం సినిమా మొదటి భాగం బ్రహ్మస్రం : శివ సెప్టెంబర్ 9 వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో అమితా బచ్చన్ ,  నాగార్జున , మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించ బోతున్నారు. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు.

తెలుగు లో ఈ మూవీ ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ రన్ టైమ్ ని 2 గంటల 47 నిమిషాలకు మూవీ యూనిట్ లాక్ చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ఎలాంటి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: