దసరా రేసు కు రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ సినిమాలు చిరంజీవి నాగార్జున లు స్టామినాకు పరీక్షగా మారడంతో ఆ రెండు సినిమాలను నాగ్ చిరంజీవి లు చాల ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సీనియర్ హీరోలుగా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని శాసించిన వీరిద్దరికీ ఒక బ్లాక్ బష్టర్ హిట్ కావాలి.


ఇలాంటి పరిస్థితుల మధ్య వీరిద్దరి మధ్య ఏర్పడిన దసరా రేస్ ఆశక్తికరంగా మారింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి దసరా కు ఈ నెలాఖరి నుండి ఏకంగా 7 భారీ సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో ఇన్ని సినిమాల మధ్య సగటు ప్రేక్షకుడు ఎన్ని సినిమాలను చూస్తాడు అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈమధ్య జరిగిన ‘దిఘోస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున ఆసినిమాను ప్రమోట్ చేస్తూ చేసిన కామెంట్స్ కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.


‘శివ’ సినిమాలో గతంలో తాను సైకిల్ చైన్ పట్టుకువచ్చి ఒక ట్రెండ్ ను సృష్టించిన విధంగా ‘ది ఘోస్ట్’ మూవీలో తాను ఒక కత్తిని పట్టుకువచ్చి మరో ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నట్లుగా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కామెంట్ చేసాడు. ఇక చిరంజీవి అయితే ‘గాడ్ ఫాదర్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గాడ్ ఫాదర్’ మూవీలో కొన్ని పొలిటికల్ సెటైర్లు ఉండబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.


దీనితో వీరిద్దరి కామెంట్స్ ను బట్టి తాము నటిస్తున్న రెండు సినిమాలు రొటీన్ సినిమాలు మాత్రమే అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. డిఫరెంట్ కథలను డిఫరెంట్ సన్నివేశాలను కోరుకుంటున్నారు. అయితే అవి ఏమీ పట్టించుకోకుండా మన సీనియర్ హీరోలు కేవలం తమకు అలవాటైన రొటీన్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ పోతాము అంటూ చెపుతూ ఉంటే మారిన పరిస్థితులతో మన టాప్ హీరోలు మారలేకపోతున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: