టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన సంపత్ నంది గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది ఈవేళ అనే ఒక చిన్న మూవీతో సంపత్ నంది దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత రచ్చ ,  బెంగాల్ టైగర్ ,  గౌతమ్ నంద ,  తాజాగా సిటిమార్ వంటి పలు మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపత్ నంది ఏర్పరచుకున్నాడు. సంపత్ నంది ఆఖరుగా దశకత్వం వహించిన సీటిమార్ మూవీ లో గోపీచంద్ హీరోగా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

సిటీ మార్ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న సంపత్ నంది తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. ఇది ఇలా ఉంటే సంపత్ నంది తన తదుపరి మూవీ ని కళ్యాణ్ రామ్ తో చేయనున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే దర్శకుడు సంపత్ నంది ,  కళ్యాణ్ రామ్ కి ఒక కథను వినిపించినట్టు , ఆ కథ బాగా నచ్చిన కళ్యాణ్ రామ్ , సంపత్ నంది దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ,  మరి కొద్ది రోజుల్లోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ స్టార్ట్ కానున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎలా ఉంటే కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసారా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి ,  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: