తెలుగు సినిమాఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వెంకీ కుడుముల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దర్శకుడు వెంకీ కుడుములనాగ శౌర్యహీరో గా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన చలో మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా భీష్మ అనే మూవీ ని వెంకీ కుడుముల తలకెక్కించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఛలో మరియు భీష్మ మూవీ లలో కామెడీ ని డీల్ చేసిన విధానానికి వెంకీ కుడుముల కు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఇలా రెండు వరుస విజాయలతో వెంకీ కుడుముల టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడి గా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం మెగాస్టార్చిరంజీవిహీరో గా ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు వెంకీ కుడుముల ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ఈ ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు చిరంజీవి , వెంకి కుడుమల కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకీ కుడుముల కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... వెంకీ కుడుములబాలకృష్ణ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో ఒక మూవీ ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ కు వెంకీ కుడుముల ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన బాలకృష్ణ , వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీచిరంజీవి , వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కంటే ముందు వస్తుందా , లేక తర్వాత వస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: