కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీ లలో హీరోయిన్ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సంగీత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ పాత్రలలో నటించిన సంగీత ప్రస్తుతం సినిమాల్లో ఇద్దరు ముఖ్య పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగా తాజాగా సంగీత "మసుద" అనే హర్రర్ జోనర్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. సాయికిరణ్ దర్శకత్వం వహించిన , ఈ మూవీ కి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరించాడు.

మూవీ లో సంగీత తో పాటు తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఈ రెండు రోజుల్లో మసుద మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 44 లక్షలు .
సీడెడ్ : 16 లక్షలు .
ఆంధ్ర :  64 లక్షలు .
2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మసుద మూవీ 65 లక్షల షేర్ , 1.24 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండు రోజుల్లో మసుధ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 70 70 లక్షల షేర్ , 1.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: