తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళం లో రూపొందుతుంది. రష్మిక మందన ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే రంజితమే అనే తమిళ వర్షన్ సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ తమిళ్ వర్షన్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సాంగ్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ వ్యూస్  కూడా లభించాయి. తాజాగా వారసుడు మూవీ యూనిట్ రంజితమే తెలుగు వర్షన్ సాంగ్ ను విడుదల చేసింది. రంజితమే తెలుగు వర్షన్ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

రంజితమే తెలుగు వర్షన్ సాంగ్ ఇప్పటివరకు 2.5 మిలియన్ వ్యూస్ ను , 139 కే లైక్ లను సాధించింది. ఈ సాంగ్ తెలుగు వర్షన్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ ను డిసెంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: