టాలీవుడ్ లో చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే నటిగా ఎంతో పేరును మరియు ప్రతిష్టను సంపాదించుకుంది. ఆ తరువాత టాలీవుడ్ హీరో నాగచైతన్యను ప్రేమవివాహం చేసుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వలన సమంత మరియు నాగచైతన్యలు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంతకు కెరీర్ అంత మంచిగా సాగడం లేదని చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ "ఊ అంటావా మావా... ఉహూ అంటావా మావా" మినహా తన కెరీర్ ఏమంత బాగాలేదు. ఆ తర్వాత ఈ మధ్య రిలీజ్ అయిన లేడీ ఓరియెంటెడ్ సెంటిమెంటల్ థ్రిల్లర్ మూవీ "యశోద" కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్ లను సాధించి సమంతకు పర్వాలేదనిపించే ఫలితాన్ని అందించింది. ఈ సినిమాను తమిళ దర్శక ద్వయం హరి మరియు హరీష్ లు తెరకెక్కించారు. ఎంచుకున్న పాయింట్ బాగున్నా, సెన్సిటివ్ పాయింట్ కావడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారన్నది ట్రేడ్ వర్గాల మాట. అయితే ఆ తర్వాత అంతే అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ "శాకుంతలం". ఈ సినిమాకు చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి పేరును సొంతం చేసుకున్న సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. షూటిగ్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 17 వ తదీన శాకుంతలం పాన్ ఇండియా మూవీగా థియేటర్ లలో సందడి చేయనుంది. మరి ఈ సినిమా అయినా సమంతను ఆదుకుంటుందా లేదా అన్న సస్పెన్స్ లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సమంత ఒక వింత వ్యాధితో బాధపడుతో చికిత్సను తీసుకుంటోంది.. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: