సాధారణంగా చాలామంది అభిమానులు తమ అభిమాన హీరోల పోస్టర్లు, కటౌట్లకు  పూలదండలు మరియు పాలాభిషేకాలు చేస్తూ వారి మీద ఉన్న ప్రేమను చాటుతూ ఉంటారు. అయితే ఫ్యాన్స్ అంటే ఇవి చేయడమే కాదు కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సహాయాన్ని కూడా అందించాలి. వారి కష్టాలను తెలుసుకొని కొంతమేరకు సహాయం కూడా అందించాలి. అయితే ప్రస్తుతం ఇదే ఫాలో అవుతున్నారు అమెరికాలో ఉన్న జనార్ధన్. అయితే దాదాపు 50 ఏళ్లు వయసున్న ఈయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈయనకి అమితమైన ప్రేమ. 

అయితే ప్రస్తుతం జనార్ధన్ షోల్డర్ ఆర్థరైటిస్ అని ఒక సమస్యతో బాధపడుతున్నారు. అయితే తాజాగా తన అనారోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కొంతమంది క్యాన్సర్ రోగుల కోసం ఆయన ఆఫ్రికాలోని టాన్జానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. అయితే మైనస్ డిగ్రీలో ఉష్ణోగ్రత , 30% ఆక్సిజన్ ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం వెనకాడకుండా క్యాన్సర్ బాధితుల కోసం పర్వతాన్ని ఎక్కి దాదాపు 7 రోజులకు పైగా అని ఈ సాహసాన్ని కొనసాగించారు. బసవతారకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ని జనార్ధన్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

దీనికిగాను దాదాపు కోటి రూపాయలకు పైగా  ఫండ్స్ కూడా వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఫండ్స్ వచ్చిన ఈ డబ్బుతో క్యాన్సర్ రోగుల చికిత్స కు కావలసిన ఆధునిక పరికరాలను తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.త్వరలోనే మరో ప్రాజెక్టుకి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈసారి ఒకే హాస్పిటల్ కి వచ్చాం కానీ త్వరలోనే వివిధ హాస్పిటల్స్ కి ఫండ్స్ రైస్ చేద్దామని భావిస్తున్నాము. అంతేకదా ముఖ్యంగా గుండె జబ్బు ఉన్న చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాలని అనుకుంటున్నాము. డిసెంబర్ లోబో దాదాపు రెండు కోట్లు సేకరించి పిల్లల హార్డ్ సర్జరీలో చేయాలని మేమంతా భావిస్తున్నాం. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించాలి అని భావిస్తున్నాము అంటూ తెలిపారు జనార్ధన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: