సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. ఇప్పటికీ కూడా అదే స్టార్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమాలు చేస్తోంది. ఇక శ్రీ అనే సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్ గా పరిచయమైన తమన్న.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాతో మంచి క్రేజ్ ను అందుకుంది. ఈ సినిమాతో తమన్నా ఫేటే మారిపోయింది. ఇక తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా తమన్నా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తమన్నాకు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే చాలాసార్లు తమన్న తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే తాజాగా తమన్నా లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని సమాచారం. తాజాగా ఈ జంట న్యూ ఇయర్ రోజు గోవాలో పార్టీ చేసుకుంటూ హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ బయటపడింది.

అయితే ఇప్పటికీ ఈ ఇద్దరు ప్రేమ విషయం గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ న్యూ ఇయర్ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చేటప్పుడు మరోసారి ఈ జంట మీడియా కంటపడ్డారు. ఇంతకీ విజయ్ వర్మ తమన్నాల లవ్ ఎలా స్టార్ట్ అయిందనే విషయంలోకి వెళ్తే.. ఇక ఈ ఇద్దరు కలిసి బాలీవుడ్ లో 'లస్ట్ స్టోరీ 2' అనే వెబ్ సిరీస్ లో  నటించారు. ఇక ఆ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త పెరిగి అది కాస్త ప్రేమ వరకు వెళ్లిందని తెలుస్తోంది. అంతేకాదు గతంలో ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంగ్ కచేరిలో సైతం ఈ జంట ఒకే దగ్గర కలిసి కనిపించారు. అంతే కాదు ఇటీవల తమన్నా పుట్టినరోజున విజయ్ వర్మ ఆమెను స్వయంగా కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా వీరిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నా.. ఈ జంట మాత్రం ఈ వార్తల పై క్లారిటీ ఇవ్వడం లేదు. మరి త్వరలోనే ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ.. ఈ జంట గుడ్ న్యూస్ ఏమైనా చెప్తుందేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: