జబర్దస్త్ కార్యక్రమం గతంలో మాదిరిగా భారీ ఎత్తున రేటింగ్ ఈ మధ్యకాలంలో నమోదు అవ్వడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గతంలో మాదిరిగా రేటింగ్ను సొంతం చేసుకొనే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించలేదని తెలుస్తోంది. మల్లెమాల వారు లవ్ స్టోరీలను కొత్తగా చూపించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా లవ్ ట్రాకులను సృష్టించేందుకు పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏవి కూడా ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోతున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ టీం లీడర్ రాకింగ్ రాకేష్ మరియు జోర్దార్ సుజాత ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే



ఇక వీరిద్దరి త్వరలో వివాహం చేసుకోబోతున్నారని తెలియజేశారు. అయినా కూడా జబర్దస్త్ కార్యక్రమంలో వీరిద్దరూ ఏదో కొత్తగా ప్రేమలో పడ్డారని వారిద్దరి ప్రేమను ఇప్పుడే చూపిస్తున్నామన్నట్లుగా ప్రోమోలో హైలెట్ చేశారు. ఇక స్టేజ్ పైన రాకింగ్ రాకేష్ రింగు తీసుకొని సుజాత చేతివేళ్ళకి తొడగడం జరిగింది. గతంలో కూడా ఇదే సన్నివేశాలు ఎన్నో జంటలకు కూడా చేశాయి ఇవన్నీ చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లెమాల సంస్థ పైన కూడా పలువురు నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


కొత్త కంటెస్టెంట్ లేకపోతే జబర్దస్త్ కార్యక్రమాన్ని మూసివేయాలి అంతేతప్ప ఇలాంటివి తీయవద్దు అంటూ  కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గతంలో లాగా కమెడియన్స్ ఇప్పుడు కామెడీ చేయడం లేదు.. అనే కామెంట్లు చేస్తున్నారు. ఇక గత కమెడియన్స్ను కూడా తీసుకురావాలని మల్లెమాలవారికి ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ షో పైన చేసే లవ్ ట్రాక్లు, ఎమోషనల్ మరికొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక వీటి పైన పలు ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. కొత్త కమెడియన్స్ వచ్చిన వారు కూడా ఆరదించలేకపోతున్నారని పాత కమెడియన్స్ ని తీసుకు రావాలని కోరుకుంటున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: