విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నారు. అదికూడా హిట్ లాంటి ఒక క్రైం సీరీస్ లను డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనుతో ఆయన చేతులు కలిపారు. వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో సైంధవ్ సినిమా వస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. వెంకటేష్ ని ఇలాంటి సీరియస్ రోల్ లో చూసి చాలా కాలమైందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. సైంధవ్ వెంకీ మామ ని వేరే లెవెల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు శైలేష్ కొలను.

నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. సైంధవ్ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పొంగల్ రేసులో వెంకటేష్ తన మాస్ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నారు. కొన్నాళ్లుగా కామెండీ కథలనే చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న వెంకటేష్ సైంధవ్ తో ఈసారి సీరియస్ సినిమాతో వస్తున్నారు.

శైలేష్ కొలను హిట్ సీరీస్ లు మాత్రమే చేస్తాడు. హిట్ 3 కూడా లైన్ లో ఉందని తెలుస్తుండగా వాటికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి సైంధవ్ ని ముందుకు తెచ్చాడు. హిట్, హిట్ 2 సినిమాలతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన శైలేష్ ఈ సైంధవ్ సినిమాతో కూడా తన స్టామినా ప్రూవ్ చేయాలని అనుకున్నారు. వెంకటేష్ కూడా ఈ సినిమాతో మరోసారి తన మాస్ స్టామినా చూపించనున్నారు. టీజర్ తోనే వారెవా అనిపించిన వెంకీ సైంధవ్ తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తారని చెప్పొచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయడం మరో విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: