రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ మరియు అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు జోడి గా నటించింది. అలాగే మహేష్ తో  కూడా ఒక సినిమాలో నటించింది.

 నాలుగు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ గత రెండు మూడు సంవత్సరాలుగా పూర్తిగా అయితే కనిపించకుండా పోయింది. తెలుగు లో పెద్దగా సినిమాల్లో ఛాన్స్ లు కూడా రావడం లేదు. హిందీలో అవకాశాలు వస్తున్నా కానీ ఆ సినిమాలు సక్సెస్ కావడం లేదు. దానితో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

హిందీ లో గత సంవత్సరం  ఐదు నుంచి ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమె కు సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. దాంతో ప్రస్తుతం హిందీ లో కూడా సినిమా లు ఈమె కు లేవని తెలుస్తుంది. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సినిమా ఆఫర్స్ లేక పోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ చాలా డల్ గా సాగుతుందట. ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధం అవుతుంది.. కానీ అవి కూడా ఈమెకు దక్కడం లేదని ప్రచారం అయితే జరుగుతుంది.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తెగ యాక్టివ్ గా ఉంది. వరుస ఆఫర్స్ కోసం తెగ కష్టపడుతుంది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా అంతగా లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీగా మారింది.వరుసగా జిమ్ వర్క్ అవుట్ లు వంటి వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ గా పెంచుకుంది.నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: