రాజావారు రాణి గారు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా ... కాశ్మీరీ పరదేశి ఈ సినిమాలో కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. 

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంcతో ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.73 కోట్ల షేర్ ... 9.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది. దీనితో ఈ రోజుతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ముల ను కంప్లీట్ చేసుకుని 0.23 కోట్ల లాభాలను అందుకొని హిట్ స్టేటస్ ను అందుకుంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: