టాలీవుడ్ లో 'పేపర్ బాయ్' అనే సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా విజయం అందుకున్న జయశంకర్.. ఇప్పుడు 'అరి' అనే యూనివర్సల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ లుక్, టీజర్ ప్రమోషనల్ వీడియోతో సినిమాపై ఆసక్తి పెంచారు. ఇటీవల ఈ సినిమా నుండి మంగ్లీ పాడిన 'చిన్నారి కిట్టయ్య' పాటకి మంచి ఆదరణ లభించింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'అరి' మూవీ ట్రైలర్ను మార్చి 12న (ఈరోజు) విడుదల చేశారు.అరిషడ్వర్గాల్లోని కామ.. క్రోధ.. లోభ.. మోహ.. మత్సార్యాల చుట్టూ తిరిగే కథ ఇది. 

ఓ మనిషి ఎలా బతకకూడదు? అనే అంశాన్ని సరికొత్త కోణంలో ఈ సినిమాని చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు జయశంకర్ ప్రతి మనిషిలో దాగి ఉండే హరిషడ్వర్గాల కోసం మనిషి ఎంతకు దిగజారి పోతాడు? మనిషి పతనానికి ఇవి ఎలా కారణము అవుతాయి అన్న అంశాన్ని ఈ ట్రైలర్ లో చాలా ఆసక్తికరంగా చూపించారు. కృష్ణ తత్వాన్ని కొత్త కోణంలో చూపిస్తూ డివోషనల్ టచ్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగర్, వైవా హర్ష, సురభి ప్రభావతి తదితరులు ముఖ్య భూమిక పోషించారు. జలసి పాత్రలో అనసూయ ట్రైన్ లో తన అందంతో ఆకట్టుకుంది. గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్ మరోసారి విలక్షణంగా కనిపించారు.

ట్రైలర్లో ఓ అమ్మాయిని రేప్ చేయాలి అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. ఇక అటాచ్మెంట్ అనే క్యారెక్టర్ లో సురభి ప్రభావతి కనిపించారు. అటు ప్రైడ్ గా సాయికుమార్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆంగర్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగర్.. లస్ట్ గా వైవాహర్ష వారి వారి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ట్రైలర్ లో పాత్రలను పరిచయం చేసిన తీరు వారి క్యారెక్టర్జేషన్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెంచుతోంది. ఇక వీళ్లతో పాటు సుమన్, ఆమని, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, జెమిని సురేష్, ఐ డ్రీమ్ అంజలి, ప్రవల్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు. ఆర్ వి రెడ్డి సమర్పణలో ఆర్ వి సినిమాస్ పతాకంపై శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: శివశంకర వరప్రసాద్.. సాహిత్యం: వనమాలి, కాసర్ల శ్యామ్.. ఎడిటర్: జి అవినాష్.. కొరియోగ్రాఫర్స్: భాను, జీతు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: