ఇటీవలే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కార్యక్రమంలో అటు భారత్ కు రెండు ఆస్కార్ అవార్డులు రావడం గమనార్హం. ఇక ఇందులో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా ఉంది అని చెప్పాలి. మరోవైపు కేవలం 10 లక్షల ఖర్చుతో మాత్రమే తెరకెక్కిన మరో చిన్న ఫిలిం కూడా ఉంది అని చెప్పాలి. ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే చిన్న ఫిలిం కి ఆస్కార్ అవార్డు దక్కింది అని చెప్పాలి. ఇక యావత్ ప్రపంచం మొత్తం భారత్ వైపు తల తిప్పి చూసేలా ఈ చిన్న ఫిలిం ఘనత సాధించింది అని చెప్పాలి.


 అంతేకాదు ఇక ఏనుగుల సంరక్షణ కోసం తమ జీవితాన్ని మొత్తం అంకితం చేసిన జంట పేర్లు అటు వరల్డ్ టీవీలో కూడా మారుమోగిపోయాయి అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ప్రపంచం మొత్తం ఇక ఈ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంది. కానీ ఆస్కార్ అవార్డు వచ్చినప్పటికీ ఈ ఇద్దరికి మాత్రం అస్సలు పట్టింపు లేదు. హడావిడి లేకుండానే పచ్చటి అడవిలో సేద తీరుతూ ఉన్నారు బొమ్మన్, పిల్లయ్ జంట. ప్రకృతిలోనే హాయిగా గడిపేస్తున్నారు అని చెప్పాలి. అయితే ది ఎలిఫెంట్ విస్పరర్స్ గా కీర్తి గడించిన వీరు ఇక తమ దగ్గర ఉన్న గున్న ఏనుగులు దూరం అవడంతో ప్రస్తుతం బెంగ పెట్టుకున్నారు అని చెప్పాలి. ఏనుగులు చిన్నగా ఉన్నప్పటి నుంచి సాకుతూ వచ్చిన ఈ జంట ఇక ఇప్పుడు వాటికి వయసు వచ్చేసరికి వేరే క్యాంపుకు తరలించడంతో ఖాళీగానే ఉన్నారు.


 అయితే ఇక ఇటీవలే ఆస్కార్ అవార్డును సైతం ఈ జంట తిరస్కరించింది అని చెప్పాలి. అంతర్జాతీయ వేదికపై జరుగుతున్న హడావిడి ఏమీ పట్టని ఈ దంపతులు.. తమకు ఇవేమీ వద్దు అంటూ తృనప్యాయంగా ఆస్కార్ అవార్డును  సైతం తోసిపుచ్చారు. దానికి బదులు మరో చిన్నారి గున్న ఏనుగును తమకు బహుమతిగా ఇవ్వమంటూ ఒక గొప్ప మనసును చాటుకున్నారు ఈ జంట. ఇక ఇలా గున్న ఏనుగుని ఇస్తే అదే తమకు 10000 అంటున్నారు. ఇక వారి మాటలతో అందరూ ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: