టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ పోయిన సంవత్సరం ఓరి దేవుడా అనే మూవీ తో ప్రేక్షకులను పలక రించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి ఓ మై కడవులేకి అనే సినిమాకు అధికారిక రీమేగా రూపొందింది. ఈ ఒరిజినల్ మూవీ కి దర్శకత్వం వహించినటు వంటి అశ్విత్ మరిముత్తు ఈ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.

ఓరి దేవుడా తెలుగు వర్షన్ మూవీ లో మిథిలా పాల్కర్ మరియు ఆశా భట్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో కలిసి పీవీపీ సినిమా వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్ర లో నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

 అలాగే ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకు లను అల్లరించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటు వంటి జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని జెమిని సంస్థ బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: