
అతని పేరు రాబర్ట్ డౌని.. అతని పేరు చెబితే కొంతమంది ప్రేక్షకులు గుర్తుపడతారేమో కానీ అందరూ ప్రేక్షకులు మాత్రం గుర్తుపట్టలేరు. ఎందుకంటే అతను అతని అసలు పేరు కంటే టోనీ స్టార్క్ అనే పేరుతోనే బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ కూడా అతని ఫోటో కనిపించింది అంటే చాలు ఇతను టోనీ స్టార్క్ అని అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది అతని ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అవెంజర్ సిరీస్లో ఐరన్ మాన్ గా ప్రేక్షకులు అందరిని కూడా అలరించాడు రాబర్ట్ డౌని. అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని రీతిలో క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి.
అయితే అతనికి వరల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ ఉంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన నిలిచింది అని చెప్పాలి. ఏకంగా అతను నమిలి పడేసిన చూయింగం ఏకంగా 45 లక్షల ధర పలికింది అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. గత నెలలో జరిగిన జోన్ పావ్ రు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ వేడుకలో రాబర్ట్ డౌని నమిలిన చూయింగం వేలం వేయడంతో.. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.ఈ విషయం తెలిసి వామ్మో నమిలిపడేసిన చూయింగ్ మరి ఇంత ధరా అని అందరూ షాక్ అవుతున్నారు.