తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రేమ కథల్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడు అని పేరు కలిగినటు వంటి దర్శకుల్లో ఒకరు అయినా శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా బృందం ఇప్పటి నుండే ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టింది.

అందులో భాగంగా నిన్న అనగా మే 9 వ తేదీన ఈ సినిమా నుండి మొదటి పాటను ఈ చిత్ర బృందం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ మొదటి పాట తెలుగు వర్షన్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లోని తెలుగు వర్షన్ మొదటి పాట "నా రోజా నువ్వే" అనే సాంగ్ 24 గంటల్లో 5.06 మిలియన్ వ్యూస్ ను ... 126 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. లైగర్ అనే టాన్ ఇండియా మూవీ తో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విజయ్ ఈ సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: