బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భార్యగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అనుష్క శర్మ కెరియర్ పరంగా చాలా సెలెక్టివ్ గా ముందుకు వెళుతోంది నటిగా కంటే బిజినెస్మేన్ గా ఎదిగేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే బిజినెస్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది.. విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మకు ఉన్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనేలా సరికొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. తాజాగా అనుష్క శర్మ కేరియర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక మీదట ఏడాదికి ఒక సినిమా మాత్రమే నటిస్తానని అంతకుమించి అభిమానులు ఎవరు ఇంకేమి ఆశించవద్దు అంటూ ప్రకటించింది.. ఈ నిర్ణయం అభిమానులను స్వాగతించిన స్వాగతించకపోయిన తప్పని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలియజేయడం జరిగింది. ఈ విషయం భిన్న అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు... కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీ సినిమా చేయద్దన్నారు లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. కేవలం ఏ నిర్ణయం తన కుటుంబం కోసమే తీసుకున్నానంటూ తెలియజేసింది అనుష్క శర్మ..


ముఖ్యంగా తన కూతురు వామికాకు ఇది చాలా కీలకమైన సమయం.. ఈ వయసులో తన ఆలనా పాలన దగ్గరుండి చూసుకోవాలి ఈ విషయంపై అశ్రద్ధ చేయడానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి విరాట్ తండ్రి బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నాడు తను చాలా మంచి వ్యక్తి కానీ వామికాకి తల్లిగా తన బాధ్యత వ్యవహరించాలి నేను ఎక్కువ సమయం తనతోనే గడపాలి అనుకున్నాను అంటూ తెలియజేసింది. వీటితోపాటు తన కుటుంబ సభ్యుల్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ తెలిపింది అనుష్క శర్మ. దీంతో వాటన్నిటికీ నేను తీసుకుని నిర్ణయంతో పుల్ స్టాప్ పడతాయని నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: