మనిషి పక్షి లా ఎగరలేడు చిరుత లా పరుగు పెట్టలేడు తిమింగిలం లా వేగంగా ఈదలేడు. వాస్తవానికి ఒక పిల్లవాడు పుట్టి కొన్నినెలలు పెరిగిన తరువాత రెండు కాళ్ళతో నడవడం కూడ రాదు. అయితే ఇది అంతా పుట్టుకతో రాకపోయినా కేవలం శిక్షణ ద్వారా మాత్రమే ఒక మనిషికి ఈ విద్యలన్నీ వస్తాయి. అంతేకాదు చదవడం వ్రాయడం మాట్లాడటం ఇలా అన్ని విషయాలు ఒక వ్యక్తికి శిక్షణ ద్వారా మాత్రమే వస్తాయి.


‘శిక్షణ అనేది ఒక మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. శిక్షణ ద్వారా సాధించలేనిది ఏది ఉండదు’ అని అంటారు ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్. మనం ఏరంగంలో విజయం సాధించాలి అని ఆలోచనలు చేస్తూ ఉంటామో ఆరంగానికి సంబంధించి ఒక నిష్ణాతుడు వద్ద శిక్షణ తీసుకోకుండా మనిషికి విజయంతో పాటు ఐశ్వర్యం రాదు అని అంటారు.


ఒకసారి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో ఒక మార్కెట్ కు వచ్చినప్పుడు ఒక అభిమాని ఆయనను గుర్తించి ఆయన వద్దకు వేగంగా వచ్చి ఒక తెల్లకాగితం ఇచ్చి ఒక బొమ్మను గీసి పెట్టమని అడుగుతాడు. దానికి పికాసో అంగీకరించి కేవలం పది సెకన్స్ లో ఒక బొమ్మను గీసి పికాసో ఆ అభిమాని చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉంచుకో ఈ బొమ్మ విలువ 10 లక్షలు అని చెపుతాడు.


దీనితో నిర్ఘాంతపోయిన ఆ అభిమాని పది సెకన్ల బొమ్మకు 10 లక్షలు ఏమిటి అని అడిగితే దీని వెనుక 30 సంవత్సరాల కృషి ఉంది అంటూ పికాసో చెప్పి ఆ అభిమానిని ఆశ్చర్య పరిచాడట. దీనితో నైపుణ్యంతోనే అద్భుతాలు జరుగుతాయని నైపుణ్యం లేకుండా ఎన్ని తెలివితేటలు ఉన్నా మరెన్ని అవకాశాలు వచ్చినా ఒక వ్యక్తి విజయం సాధించలేడు అన్న విషయం స్పష్టం అవుతోంది. దీనితో మనిషికి తెలిసేది ఏమిటంటే నైపుణ్యంతోనే అద్భుతాలు తద్వారా వచ్చే సంపద అన్నది వాస్తవం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: