పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబాని మాటకు భారతదేశంలో ఎదురులేదు. అలాంటి వ్యక్తికి అమెజాన్ అధినేత జెఫ్ బెబోస్ ఇచ్చిన షాక్ పారిశ్రామిక వర్గాలలో సంచలన వార్తగా మారింది. దేశీయ ఆన్ లైన్ ఆఫ్ లైన్ రిటైల్ రంగంలో పట్టు సంపాదించడానికి రిలయన్స్ రిటైల్ అమెజాన్ ల మధ్య జరుగుతున్న రణం ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లు ఎక్కింది.


రిలయన్స్ రిటైల్ సంస్థ ఫ్యూచర్ రిటైల్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని నిలుపుదల చేయమంటూ అమెజాన్ సంస్థ అధినేత బెబోస్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రిలయన్స్ ఫ్యూచర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు అయిన ముకేష్ అంబాని బెజోస్ లు ఇండియన్ రిటైల్ రంగంలో ఆధిపత్యం గురించి ఒకేసారి పట్టుపట్టడంతో ఈ అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.


అమెజాన్ కు భారతీయ ఈ కామర్స్ రంగంలో విపరీతమైన పట్టు ఉంది. అమెజాన్ ఎంత విస్తరించినా ఇంకా మనదేశంలో చిన్న నగరాలు పట్టణాలలోకి ఇంకా భారీ స్థాయిలోకి వెళ్ళలేకపోతోంది. దీనితో ఫ్యూచర్ గ్రూప్ సహాయంతో చిన్న పట్టణంలో గ్రాసరి నుంచి ఎల్ట్రానిక్స్ వస్తువుల వరకు అమ్మకాలు జరగాలి అంటే అమెజాన్ కు మంచి నెట్ వర్క్ ఉన్న ప్రముఖ సంస్థ కావాలి. ఇలాంటి పరిస్థితులలో మొదట్లో తమతో కలుస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి రిలయన్స్ రిటైల్ వైపు ఫ్యూచర్ రిటైల్ వెళ్లిపోయిన విషయాన్ని అమెజాన్ చాల సీరియస్ గా తీసుకుంది.


భారత్ ఈకామర్స్ రంగంలో 6 వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్న అమెజాన్ ఇప్పుడు రిలయన్స్ ఫ్యూచర్ సంస్థల కలయికను అంగీకరిస్తే తమ అస్తిత్వం పోతుంది అన్న అంచనాలో అమెజాన్ ఉంది. దీనితో ఈ కలయికను అడ్డుకట్టవేసి తమ సత్తా చూపించాలని అమెజాన్ చేస్తున్న ప్రయత్నాలకు ముకేష్ అంబాని ఎలాంటి ఎత్తుగడలు వేయగలడు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో పెరిగిపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: