ప్రస్తుతం బ్యాక్ లు మాత్రమే కాదు అనేక కార్పోరేట్ ఫైనాన్స్ కంపెనీలు కూడ ఒక వ్యక్తికి రుణం ఇచ్చే ముందు అతడి ఆదాయం ఎంత అన్న విషయం కంటె అతడి క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అన్న విషయం పరిగణలోకి తీసుకోకుండా చిన్న రుణాన్ని కూడ ఇవ్వవు.


దీనితో క్రెడిట్ స్కోర్ లేని వ్యక్తి కనీసం ఒక చిన్న టీవి ని కూడ అప్పుగా ఫైనాన్స్ సంస్థల రుణాలతో కొనుక్కోలేడు. ప్రస్తుతం క్రెడిట్స్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్ధిక అత్యవసరంగా మారిపోయింది. మంచి క్రెడిట్ స్కోర్ లేని వ్యక్తికి బ్యాంక్ లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అయితే క్రెడిట్ స్కోర్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే రుణాలు పొందడం సులువు అనీ మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.


మన క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ మన ప్రస్తుత ఆదాయం చాల మెరుగుగా ఉందని అదేవిధంగా నెలసరి వాయిదాలు చాల సులువుగా కట్టగలమన్న భరోసా బ్యాంకులకు కలిగితే మనం కోరుకున్న రుణాలు పొందవచ్చు. అయితే వడ్డీ కాస్త అధికంగా చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే రుణం ఎంత తక్కువగా తీసుకుంటే అంత రుణమంజూరు అవకాశాలు అంత మెరుగుపడతాయి. అదేవిధంగా మనం తీసుకునే లోను  అప్లికేషన్ లో మనం ఒక హామీ దారుడుని చేర్చగలిగితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వెంటనే కోరుకున్న రుణం మంజూరు అయిపోతుంది.


అయితే మనం హామీ దారుడుగా పేర్కునే వ్యక్తి క్రెడిట్ స్కోర్ బాగుండాలి. అదేవిధంగా మన క్రెడిట్ స్కోర్ లో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు దొర్లే అవకాశాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా సరిదిద్దుకుంటే రుణాలు పొందడం సులువు. ఈ విషయాలు అన్నీ చాల లోతుగా ఎవరికి వారు విశ్లేషణ చేసుకున్నప్పుడు మాత్రమే అత్యవసర సమయంలో మనకు రుణాలు మనం పొందడం సులువు..

మరింత సమాచారం తెలుసుకోండి: