ఇటీవల కాలంలో చాలామంది డబ్బు దాచుకోవడానికి బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్ డిపాజిట్ లలో ఎక్కువగా దాచుకుంటున్నారు. అయితే అధిక వడ్డీ వస్తుంది అన్న నేపథ్యంలో కూడా చాలామంది బ్యాంకులలో భద్రపరచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనం పెట్టుబడి పెట్టినప్పుడు తగినంత రాబడిని ఎలా.. ఏ విధంగా పొందాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. హామీతో కూడిన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. అలాంటి పథకాలు పోస్ట్ ఆఫీస్ లో చాలానే ఉన్నాయి. ప్రజలు ఇందులో పెట్టుబడి పెట్టేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇందులో పెట్టుబడిగా పెట్టడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ లలో ఇచ్చే వడ్డీ రేట్ల కంటే అధికంగా లభిస్తూ ఉండడం గమనార్హం.


పోస్ట్ ఆఫీస్ పథకాలలో ప్రావీణ్యం పొందిన పథకం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం..  ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తోంది. ఈ పథకం యొక్క నిర్దిష్ట సమయం ఐదు సంవత్సరాలు.  నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ఏదైనా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ నుంచి మీరు తీసుకోవచ్చు.  ప్రస్తుతం 6.8% వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నారు. అయితే మీరు పాలసీ కాలవ్యవధిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ క్యాలిక్యులేటర్ ప్రకారం ఐదు సంవత్సరాల పాటు మీరు రూ.20 లక్షల ను పెట్టుబడిగా పెట్టినట్లయితే.. మెచ్యూరిటీ సమయం ముగిసే సరికి మీ చేతికి 28 లక్షల రూపాయలు వస్తాయి
  అంటే 8 లక్షల రూపాయలను మీరు వడ్డీగా పొందవచ్చు.


కనిష్టంగా 1000 రూపాయల నుంచి ఎంతైనా పెట్టుబడిగా పెట్టే సదుపాయం ఉంది.  ఇందులో నిర్ణయించిన సమయం వ్యవధి కంటే ముందే మీరు డబ్బును విత్ డ్రా చేసుకోలేరు.. కొన్ని మినహాయింపులతో మాత్రమే డబ్బు ఉపసంహరించుకోవచ్చు.  తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీని ఆశించే పథకాలలో ఇది చాలా ఉత్తమమైనది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: