ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బును దాచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా డబ్బు దాచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త.. బజాజ్ ఫైనాన్స్ కొత్త ఫిక్స్ డిపాజిట్ స్కీం తీసుకొచ్చింది .అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెంచేసింది. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ తాజాగా రెండు శుభవార్తలను తీసుకొచ్చి కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకొచ్చింది. తాజాగా బజాజ్ ఫైనాన్స్ ప్రవేశపెట్టిన కొత్త స్పెషల్ ఫిక్స్ డిపాజిట్ స్కీమ్ టెన్యూర్ 39 నెలలు. డబ్బు దాచుకోవాలని భావించే వారికి దీనివల్ల ఊరట కలుగుతుంది. మరో డిపాజిట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది


ముఖ్యంగా కొత్త స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో చేరితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. అలాగే 39 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం పై కస్టమర్లకు 7.6% వడ్డీ కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఇది రెగ్యులర్ కస్టమర్లకు వర్తిస్తుంది.  కానీ సీనియర్ సిటిజన్స్ కి అయితే 7.85% వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే బజాజ్ ఫైనాన్స్ 44 నెలల ఫిక్స్ డిపాజిట్ చేస్తారు దానిపై 7.7% వడ్డీ లభిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్ కు 7.95% వడ్డీ అందిస్తోంది. ముఖ్యంగా ఈ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చినట్లు బజాజ్ ఫైనాన్స్ స్పష్టం చేసింది.

ఒకవేళ 12 నెలల నుంచి 23 నెలల టెన్యూర్ లోని కమ్యూలేటివ్ ఫిక్స్ డిపాజిట్ ల పై 6.8% వడ్డీ అలాగే 24 నెలల నుంచి 35 నెలల కమ్యూలేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ లపై 7.25% వడ్డీని ఆఫర్ చేస్తోంది.  అలాగే 36 నెలల నుంచి 60 నెలల మధ్య ఫిక్స్ డిపాజిట్ లపై 7.5% వడ్డీని అందిస్తోంది.ఇలా సరికొత్త స్కీం తీసుకురావడంతో పాటూ సరికొత్త ఆకర్షణీయమైన వడ్డీరేట్లను కూడా ఆఫర్ చేస్తోంది. రూ.5కోట్ల లోపు చేసే డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: