
ముందుగా ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ చాంప్ పథకం విషయానికి వస్తే నెలవారి ,త్రైమాసికం , అర్ధవార్షికం , వార్షికం లో పెట్టుబడిగా పెట్టవచ్చు. 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా సరే ఈ పథకాన్ని కొలుగోలు చేయవచ్చు. అయితే పిల్లల వయసు పుట్టినప్పటినుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాలసీ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. బిడ్డకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తాన్ని నాలుగు వార్షిక వాయిదాల్లో తీసుకోవచ్చు. ప్రతి ఏటా 25 శాతం చొప్పున తీసుకోవచ్చు.ఈ పథకం ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవడంతోపాటు బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది . అనుకోనిది ఏదైనా జరిగితే ఈ ప్లాన్ కింద హామీ మొత్తంలో 100% వరకు బీమా పొందవచ్చు.
ఎస్బిఐ స్మార్ట్ స్కాలర్ విషయానికి వస్తే పుట్టినప్పటినుంచి 17 సంవత్సరాల మధ్య పిల్లల వయసు వుండాలి. ఈ పాలసీ 18 నుంచి 25 సంవత్సరాల మెర్క్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ పాలసీలో చేరిన వారు అత్యవసర పరిస్థితిలో డబ్బులు సొంతం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ రెండు పథకాలు కూడా పిల్లల భవిష్యత్తుకు చక్కటి ఆదాయాన్ని అందిస్తాయని చెప్పవచ్చు.