
నేపియర్ గడ్డి అని పిలవబడే ఈ గడ్డి పశువులకు మంచి మేత అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ గడ్డి పశువులకు ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు పోషకమైనది కూడా.. దీని వాడకం వల్ల పాడి పశువులలో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఇక ఈ వ్యాపారం నుంచి రైతులు మంచి లాభాలు కూడా గడిస్తున్నారు. నేపియర్ గడ్డిని 5 సంవత్సరాలకు ఒకసారి సాగు చేసినట్లయితే పంట దిగుబడి బాగా వస్తుంది. లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా వర్షాపాతం, ఎండ ఈ గడ్డికి చాలా అవసరం. జూన్, జూలైలో విత్తడం వల్ల గడ్డి పెరుగుదల బాగుంటుంది. అయితే గడ్డి పెంచేటప్పుడు సాగు లోతుగా చేయాలి. ఎకరాకి 20వేల విత్తనాలు అవసరం అవుతాయి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతీస్తూ ఉండాలి ఇది గడ్డిని వృద్ధి చేస్తుంది.
చెరుకు గడలా కనిపించే ఈ నేపియర్ గడ్డి థాయిలాండ్ ప్రాంతం నుంచి వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్ నేపియర్, రెడ్ నేపియర్ , సూపర్ నేపియర్ వంటి గడ్డి రకాలను కూడా అభివృద్ధి చేశారు. 20 కిలోల గడ్డిని ఒక మొక్క ఇస్తుంది మీరు మార్కెట్లో 10 మొక్కలను విక్రయించినట్లయితే రెండు లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.