అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే అది కష్టతరంగా మారుతోంది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఒకటే సరైన మార్గం కాదు.అనేక ఆప్షన్లో మన కెరియర్ లో ఉన్నాయి.కానీ కొంచెం తెలివిగా ఆలోచించి మనం ముందడుగు వేస్తే కచ్చితంగా ఊహించని రేంజ్ లో డబ్బు సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఒకరి దగ్గర పని చేయకూడదని భావిస్తున్నట్లయితే.. సొంతంగా ఒక వ్యాపారం పెట్టి ఆ వ్యాపారానికి మీరే యజమాని అవ్వచ్చు.. ఇకపోతే ఇప్పుడు చెప్పబోతున్న వ్యాపారానికి పెద్దగా చదువుతో సంబంధం లేదు కేవలం తెలివితేటలు అంటే సరిపోతుంది.

నిత్యం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే డిటర్జెంట్ పౌడర్ తయారీ వ్యాపారాన్ని మీరు బిజినెస్ గా మార్చుకుంటే మంచి లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందే వీలు ఉంటుంది. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో బట్టలు ఉతకాలంటే ప్రతి ఇంట్లో డిటర్జెంట్ పౌడర్ అనేది తప్పకుండా ఉపయోగిస్తారు. దీంతో మార్కెట్లో వీటి ఉత్పత్తికి కూడా డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఈ డిటర్జెంట్ పౌడర్ ను ఎలా తయారు చేస్తారంటే.. ఫారం మొదలు పెట్టడానికి కనీసం 1000 చదరపు అడుగుల స్థలం ఉండాలి యంత్రాలు ఏర్పాటుకు సరైన స్థలం కేటాయించాలి రిబ్బన్ మిక్సర్, మిషన్ సీలింగ్, స్క్రాప్లింగ్ మెషిన్లను కొనుగోలు చేస్తే సరిపోతుంది.

ముడి పదార్థాలు బొగ్గు , పెయింట్, యాసిడ్ స్లర్రీ,  యూరియా,  వాషింగ్ సోడా వంటివి ముడి సరుకులుగా మీరు కొనుగోలు చేయాలి. అయితే ఇవన్నీ ఒకేసారి మీరు కొనుగోలు చేసినప్పుడు భారీగా ధర కూడా తగ్గుతుంది. ఆన్లైన్లో కూడా వీటిని అమ్ముతున్నారు కాబట్టి మీరు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఏదైనా కంపెనీని ప్రారంభించే ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ వంటి స్థానిక సంస్థతో మీ కంపెనీని రిజిస్టర్ చేయించుకోవాలి.  8 మంది కార్మికులను నియమించుకుంటే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. రోజు 200 కిలోలు ఉత్పత్తి చేసినా సరే మీకు నెలకు రూ. 70 వేల ఆదాయం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: