ఒకప్పుడు చికెన్ మటన్ కొనుగోలు చేయడం అటు సామాన్యులకు ఎంతో భారంగా ఉండేది. కానీ ఇప్పుడు సాదాసీదా కూరగాయలు కొనుగోలు చేయడం కూడా సామాన్యుల జేబుకు చిల్లుపడేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో కూరగాయల ధరలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే టమాటా ధర భారీగా పెరిగిపోయింది. వంద రూపాయలకు పైగానే పలుకుతుంది.


 దీంతో టమాటా కొనుగోలు చేయాలంటే సామాన్యులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టమాటా లేకుండానే వంటలు కానిచ్చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. అటు పచ్చిమిర్చి ధర కూడా ఆకాశాన్ని అంటూతూ ఉండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇవి మాత్రమే కాదు బెండకాయ, వంకాయ, కాకరకాయ లాంటి కూరగాయలు కూడా కిలో 60 రూపాయల వరకు పలుకుతున్నాయి. దీంతో ఇక కూరగాయలు కొనుగోలు చేసి కడుపు నింపుకుందామన్నా కూడా కొనే స్తోమత లేని పరిస్థితి సామాన్యుడికి ఏర్పడింది అని చెప్పాలి.


 అయితే ఇలాంటి సమయంలో ఏకంగా టమాట  పచ్చిమిర్చి మినహా మిగిలిన కూరగాయలు అన్నీ కూడా కేజీ ₹20కే అమ్ముతున్నాడు ఇక్కడ ఒక వ్యాపారి. దీంతో సామాన్య ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఇక సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితిలో ఉంటారని భావించిన సదరు వ్యక్తి.. తక్కువ ధరలకు అమ్మకాలు చేస్తున్నానని చెబుతున్నాడు. అయితే తాను కొన్న ధరకే కూరగాయలను అమ్ముతున్నానని.. ఎలాంటి లాభం ఆశించడం లేదు అంటూ గౌస్ చెబుతూ ఉన్నాడు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కూరగాయల వ్యాపారి గౌస్ ఇలా తన ఉదారత చాటుకున్నాడు. 

అయితే ఇలా తక్కువ ధరకే కూరగాయలు లభిస్తున్నాయి అని తెలియడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ కూడా అక్కడికి భారీగా తరలి వెళ్తున్నారు అని చెప్పాలి.  ప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల నేపథ్యంలో ఇక తక్కువ ధరకు దొరకడంతో సామాన్యులు కాస్త ఉపశమనం పొందుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: