
తక్కువ రిస్క్ పెట్టుబడితో మంచి లాభాలను అందించే వ్యాపారాలలో ఆయిల్ మిల్లు బిజినెస్ కూడా ఒకటి. ప్రస్తుతం రోజు వారి జీవితంలో ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల నూనెలకు డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో విత్తనాల నుంచి చమురు తీసే ప్రక్రియ ఇప్పుడు ఒక మంచి వ్యాపారంగా మారింది. మీరు ఒక రూ.10 లక్షలతో ఈ వ్యాపారం మొదలుపెట్టినట్లయితే నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఇంత పెద్ద మొత్తంతో మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టలేము అనుకున్నట్లయితే ముద్ర లోన్ పథకం కింద లోన్ తీసుకొని వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.
ఈ బిజినెస్ లో ముందుగా ఆయిల్ మిల్లులో నూనె తీయడానికి విత్తనాలను గ్రైండింగ్ చేసి ఆ తర్వాత వచ్చిన నూనెను ప్యాక్ చేసి అమ్ముతారు. ఇక ఈ వెంచర్లో ఏ రకమైన ఆయిల్ మిల్లును స్థాపించాలనుకుంటున్నారో ముందుగా మీరు నిర్ణయించుకోవాలి. ఆవాల నూనె, నువ్వుల నూనె, వేరుసెనగ నూనె, ఆలీవ్ నూనె ఇలా రకరకాల ఆప్షన్లు ఉంటాయి. మీరు మార్కెట్ డిమాండ్ ను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ మిల్లు బిజినెస్ తో మంచి లాభాలను పొందవచ్చు. వీటిలో ఎటువంటి వేస్టేజ్ ఉండదు.సేల్స్ ఆపరేషన్ స్కేల్ ని బట్టి మీరు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారానికి డిమాండ్ పెరిగే కొద్దీ మీకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి