సాధారణంగా ప్రస్తుత కాలంలో సకాలంలో వర్షాలు లేక రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం అంటే కొంతమంది కష్టంగా భావిస్తున్నారు. కానీ నీటిపారుదల ఉన్న ప్రాంతాలలో వ్యవసాయం రైతులకు సిరుల పంట కురిపిస్తోంది. ఇకపోతే తక్కువ పెట్టుబడితో చేసే ఈ వ్యవసాయమే రైతులకు సిరులు కురిపిస్తుంది. వాటితో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు కూడా.. ఇకపోతే సాంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండించినట్లయితే రైతులకు మంచి లాభాలు వస్తాయి.

 అలాంటి వాటిలో లెమన్ గ్రాస్ కూడా ఒకటి.  ఈ నిమ్మగడ్డి మీకు అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరే లాభాలను అందిస్తోంది. ముఖ్యంగా ఈ నిమ్మ గడ్డితో నూనెను తయారు చేస్తారు. ఆ నూనెను ఎక్కువగా సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు,  అనేక ఔషధాలు తయారీలో వినియోగిస్తూ ఉంటారు.  ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉండడానికి కూడా కారణం ఇదే . నిమ్మగడ్డ సాగులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని కరువు ప్రభావిత ప్రాంతాలలో కూడా నాటవచ్చు.  బంజర భూముల్లో కూడా ఈ పంట నిరభ్యంతరాయంగా పండుతుంది.


 నిమ్మగడ్డి సాగుతో కేవలం ఒక హెక్టార్ తో ఏడాదికి 4లక్షల రూపాయల వరకు లాభం పొందే వీలుంటుంది అయితే ఈ నిమ్మగడ్డి వ్యవసాయానికి సరైన సమయం ఫిబ్రవరి - జూలై నెలలు మాత్రమే అనుకూలమని చెప్పవచ్చు . అప్పుడు పంట వేసుకుంటే మంచి ఫలితం పొందుతారు.  ఇకపోతే ఒకసారి ఈ పంట నాటితే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వరకు మళ్లీ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏడాదికి మూడు నుండి నాలుగు సార్లు కోత కోస్తారు. గడ్డి నుంచి మంచి సువాసన వస్తోందంటే అది కోతకు సిద్ధమైందని అర్థం చేసుకోవాలి. ఎండిన తర్వాత కూడా పొడి చేసి అమ్మవచ్చు లేదా నూనె చేసే మిషన్స్ కొనుగోలు చేసి వాటితో నూనె తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు.. ప్రస్తుతం ఈ పంటకు మంచి లాభాలు వస్తూ ఉండడంతో రైతులు ఈ పంట పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: