ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ సిపిఎస్ రద్దు అసాధ్యమని తెలిపిన ప్రభుత్వం ఓపిఎస్ స్థానంలో జీపీఎస్ ను రూపొందించింది. తాజాగా ఈ బిల్లుకి గవర్నర్ ఆమోదం చెప్పడంతో జిపిఎస్ అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ జీ పీ ఎస్ పై భిన్న అభిప్రాయాలు ఉద్యోగులలో నెలకొన్నాయి. ఇక జిపిఎస్ ద్వారా మూలవేతనంలో 50% మేరా పింఛన్ చెల్లించే విధంగా టాప్ అప్ మొత్తాన్ని కలుపుతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
దీంతో పాటు యాన్యుaటీ మొత్తం తగ్గించే కనీస పింఛన్ రూ.10,000 చెల్లించేలా టాప్ అప్ కలిపి మొత్తం చెల్లిస్తామని కూడా బిల్లులో తెలిపింది. ఇకపోతే జిపిఎస్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలు పొందేందుకు పదవీ విరమణ చేస్తే కనీసం 10 ఏళ్ల సర్వీస్ చేసి ఉండాలని నిబంధన కూడా ఉంది. ఒకవేళ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే కనీసం 20 సంవత్సరాలు సర్వీస్ ఉండాలని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి