ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలలో ఒకటైన lic తాజాగా ఒకసారి కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో బీమాకే పరిమితం కాకుండా పొదుపు ప్లాన్లను కూడా అందించే విధంగా సరికొత్త ప్లాన్సుతో కస్టమర్ల ముందుకు రాబోతోంది.దీనివల్ల చాలా మేలు జరుగుతుందని కూడా తెలియజేస్తోంది.LIC జీవన్ ఉత్సవ్ పేరుతో సరికొత్త పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. నవంబర్ 29వ తేదీన ఈ పాలసీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాలసీతో ప్రీమియం చెల్లించాలి అంటే ఎంత చెల్లించాలి ఎలాంటి బెనిఫిట్ వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

ఈ పాలసీ తీసుకున్న వారు ప్రీమియం టర్మ్ .. అయిపోయిన తర్వాత ప్రతి ఏటా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఒకవేళ రెగ్యులర్గా ఆదాయం వద్దనుకుంటే చక్ర వడ్డీ ప్రయోజనాలను పొందవచ్చు. పాలసీ తీసుకున్న ఏడాది నుంచి భీమా సదుపాయం వర్తిస్తుందట. ఈ పాలసీని 90 రోజుల వయసు వారి నుండి 65 ఏళ్లు లోపు ఉన్నవారు తీసుకోవచ్చు. ఇందులో పలు రకాల లోన్లు కూడా తీసుకోవచ్చట ఈ పాలసీ చెల్లించేందుకు గరిష్టంగా 75 ఏళ్ల వయసు నిర్ణయించడం జరిగింది.

5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది దీని కనిష్ట భీమా ఐదు లక్షలు ఐదేళ్ల ప్రీమియం చెల్లింపుతో సెలెక్ట్ చేసుకుంటే ఐదేళ్లు వేచి ఉండాలి అదే 6 ఎళ్లు ఎంచుకున్నట్లు అయితే 4 ఏళ్లు 7 సంవత్సరాలు ఎంచుకుంటే 3 సంవత్సరాలు. 8 నుంచి 16 ఏళ్లు సెలెక్ట్ చేసుకుంటే 2 ఏళ్లు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందట. ఈ ప్రీమియం పూర్తి అయిన తర్వాత ఎల్ఐసి నుంచి బీమా హామీ మొత్తంలో ప్రతి ఏటా కూడా 10% చొప్పున జీవితాంతం ఆదాయాన్ని తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు అయిపోయినప్పటికీ ఈ పాలసీ ద్వారా జీవితాంతం పలు రకాల ప్రయోజనాలను ఈ పాలసీ కింద పొందవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా 5లక్షలు ఉండాలి.


ఉదాహరణకు 25 ఏళ్ల ఉన్న వ్యక్తి 12 ఏళ్ల పాటు పది లక్షలు చెల్లించినట్లు అయితే పాలసీదారుడు ప్రతియేట 86,800 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 12 ఏళ్లు చెల్లిస్తే ప్రత్యేక 10% ఆదాయం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: