కేంద్ర ప్రభుత్వంలోని మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను సైతం తీసుకువచ్చింది. ఇప్పటికే రైతులకు పిఎం కిసాన్ స్కీం కింద డబ్బులను కూడా అందిస్తోంది.. అలాగే వీటితో పాటు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనే పథకం కూడా ఉంది.. అయితే ఈ రెండు కూడా చాలా వేరు వేరు కానీ రెండు పథకాలు కూడా 2019లోనే ప్రారంభమయ్యాయి.. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ .6000 చొప్పున అందిస్తున్నారు.. పీఎం కిసాన్ మనదన్ యోజన పథకం కింద చిన్న రైతులకు నెలవారి రూ.3000 పెన్షన్ కింద అందిస్తున్నారు.


అసలు ఈ పీఎం కిసాన్ మనదన్ యోజన అంటే ఏమిటి విషయానికి వస్తే ఇందులో 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల భూమి కలిగి ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన రైతులకు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు.. ఈ పథకం లో ఇప్పటివరకు 19,47,600 మంది రైతులు సైతం నమోదయాలని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.. ఇందులో అర్హులైన రైతులు నెలకి రూ .55 నుంచి రూ .200 వరకు పింఛన్ డబ్బులను జమ చేయవలసి ఉంటుంది..


18 సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని మొదలుపెడితే మీరు నెలకు కనీసం రూ .55 చెల్లిస్తే 40 సంవత్సరాలు వయసులో ఈ పథకాన్ని రూ .200 రూపాయలు చెల్లిస్తే 60 ఏళ్లు వచ్చేసరికి ప్రతినెలా కూడా మీ నెలవారి పింఛన్లు రూ .3000 లేదా అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు.. రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా సెంటర్ కి వెళ్లి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలను సైతం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల వయసును బట్టి వారి చెల్లింపులు కనీసం మొత్తం ఎంతో తెలియజేస్తారట. ఈ పథకం కేవలం రైతుల కోసమే ప్రత్యేకంగా పెన్షన్ ఖాతాను కూడా ఇవ్వడం జరుగుతోంది వీటితోపాటు కిసాన్ కార్డు కూడా జారీ చేయబోతారట.

మరింత సమాచారం తెలుసుకోండి: