సంపాదించే కొంత మొత్తం డబ్బు నైనా సరే చాలా మంది ఆధా చేయాలని ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి వారి ఆదాయ మార్గాలకు అనుగుణంగానే పలు రకాల సేవింగ్స్ సైతం చేస్తూ ఉంటారు ప్రజలు.. అయితే ఈ సేవింగ్స్ ను మంచి పథకాలలో పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో భారీగానే ఆదాయాన్ని అందుకోవచ్చు. ఇది కూడా ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్కు ఉండదు. ఇలాంటి వాటిలో పోస్ట్ ఆఫీస్ కూడా ఒకటి. ఈ పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడులు పెట్టడానికి బెస్ట్ స్కీం పథకాలు ఉన్నాయి. అందులో వడ్డీ రేట్లుతో కూడా మంచి లాభాలను పొందవచ్చు వాటి గురించి చూద్దాం.


1). పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ లో 4 శాతం వడ్డీ లభిస్తుంది.

2). పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం పైన 8.2 శాతం వడ్డీ లభిస్తుంది.అలాగే సుకన్య సమృద్ధి పథకం పైన 8 శాతం వడ్డీ లభిస్తుంది.

3). పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఒక ఏడాది టైం డిపాజిట్ త్రైమాసిక పథకం పైన 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఒకవేళ ఐదేళ్ల టైం డిపాజిట్ పైన పోస్ట్ ఆఫీస్ పథకాన్ని మొదలుపెడితే ప్రతి మూడు నెలలకు ఒకసారి 7.5 వడ్డీ వస్తుంది.

4). సీనియర్ సిటిజన్స్ సేవిస్ పథకంలో ఎక్కువగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీలను చెల్లిస్తారు.

5). పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ వల్ల 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.

6). అలాగే కిసాన్ వికాస్ పత్రపైన 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

7). మహిళా సన్మాన సేవింగ్ సర్టిఫికెట్ ఉండేవారికి ఈ పైన 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుందట.. పూర్తి సమాచారం కోసం దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: