ప్రస్తుతం ఉన్న రోజులలో యువత ఆలోచనా విధానాలు మారుతూ ఉన్నాయి.. గతంలో బాగా చదివి మంచి ఉద్యోగం కోసం వెతుక్కునేవారు.. కాలం మారుతున్న కొద్దీ బిజినెస్ వైపుగా ఎక్కువగా అడుగులు వేస్తున్నారు.. అలాగే కొంతమంది బ్రాండెడ్ చెప్పులు, బ్యాగులను తయారు చేస్తూ.. సరికొత్త డిజైన్లతో ప్రత్యేకమైన పాదరక్షలను కూడా తయారుచేసి యువతను ఆకట్టుకుంటూ.. వాటిని క్యాష్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా చెప్పులు, హై హీల్స్ , ఫ్లాట్ లేదా స్లైడర్లు అయినా పాదరక్షలను తయారు చేస్తూ వీటి ద్వారా మంచి లాభాలను అందుకుంటున్నారు.

గడిచిన కొన్నేళ్ల క్రితం ఆర్టిస్టిక్ నారీ బ్రాండ్ తో ఇద్దరు యువకులు మంచి సక్సెస్ ని అందుకున్నారు.. అందుతున్న సమాచారం మేరకు.. మొదట్లో అర్పిత్ మదన్, తన స్నేహితుడు కలిసి ఆర్టిస్టిక్ నారి అని చెప్పుల సంస్థను సైతం ప్రారంభించారట. డిజైనింగ్ చేయడంలో ఆర్పిత్ కు మంచి పట్టు ఉండడం వల్ల తన అభిరుచికి అనుగుణంగానే వ్యాపారాన్ని మొదలుపెట్టారు.. కర్నాల్ హర్యానాలో జరిగిన ఎగ్జిబిషన్ లో  ఒకసారి వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ విజయ రహస్యాలను అక్కడ పంచుకున్నారు..


గత సంవత్సరం ఆర్టిస్టిక్ నారీ పై తమ పనిని ప్రారంభించామని.. ప్రజలు తమ వ్యాపారాన్ని వెంచర్ కింద ఉంచినటువంటి ఉత్పత్తులను ఇష్టపడ్డారని.. మొదటిసారి తన యూనిట్ ను స్థాపించి ఇప్పుడు తన స్టార్టప్ వ్యవస్థను ప్రపంచంలో భారీగా ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యామని.. తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఆర్పిత్ తెలిపారు. తమ బ్రాండ్ కు సంబంధించి బూట్లు, బ్యాగులు వంటివి కూడా తయారు చేసినట్లు తెలిపారు. ఇకపోతే ఈ వ్యాపారం ద్వారా తమకు భారీగా లాభం వస్తుందని చదువుకొని ఉద్యోగం వచ్చిన ఇంత లాభం తాము చూసి ఉండమని చెబుతున్నారు అర్పిత్. ప్రస్తుతం తాము లాభం పొందడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలను కూడా పోషిస్తున్నట్లు స్పష్టం చేశారు.. మొత్తానికి అయితే ఈ యువత చేపట్టిన ఈ వృత్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: