RRR చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది ... అసలే చలికాలం.. అందులో రాత్రిపూట షూటింగ్.. ఇక టీమ్ పరిస్థితి ఎలా ఉందో ఉదహరిస్తూ.. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ వీడియోని షేర్ చేసింది. అందరూ చలికి వణికిపోతూ.. వేడి మంటల వద్ద చలికాచుకుంటున్నారు.  సెట్లో హీటర్స్ని కూడా ఏర్పాటు చేయడంతో..షాట్ గ్యాప్లో హీటర్ వద్దకి వచ్చి వేడినింపుకుంటున్నారు. ఎన్ని చలిగాలులు వీచినా.. మా టీమ్ మాత్రం ధృడనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చివర్లో రాజమౌళి ఎన్టీఆర్ లు ఇద్దరూ కనిపించడం విశేషం.