చాలా రోజుల నుండి రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు సోషల్ మీడియాని, మెయిన్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 26 న వీరి పెళ్లి జరగబోతుందని చాలా రోజుల నుండి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు రష్మిక విజయ్ దేవరకొండలు తమ పెళ్ళికి సంబంధించిన అఫీషియల్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో తమ ప్రేమ విషయాన్ని ఒప్పుకోవడంతో వీరిద్దరి ప్రేమపై వచ్చిన రూమర్స్ ఫైనల్ గా నిజమయ్యాయి. అయితే రీసెంట్ గానే విజయ్ దేవరకొండ రష్మిక కాంబోలో కొత్త సినిమా కూడా అనౌన్స్ చేశారు.. బ్రిటిషర్ల కాలం నాటి పిరియాడిక్ జానర్ లోని సినిమాలో ఈ జంట కనిపించబోతున్నారు.రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో వస్తున్న రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. 

1876-78 వరకు రాయలసీమలో జరిగిన స్టోరీ తో విజయ్ దేవరకొండ మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రౌడీ జనార్ధన మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న విజయ్ దేవరకొండసినిమా విడుదల కాకముందే మరో కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే వీరి సినిమాల విషయం ఏమోగానీ పెళ్లి,ప్రేమ విషయంలో మాత్రం ఈ జంట చాలా వైరల్ గా ఉంటారు. అలా గత ఏడాది డిసెంబర్లో విజయ్ రష్మిక మందన్నా ఇద్దరు చాలా రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ ఇంట్లో వీరి నిశ్చితార్థం జరిగిందంటూ మీడియాకి లీకులు వచ్చాయి. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత రోజు నుండే వీరి పెళ్లి డేట్ ల పై కూడా ఎన్నో రూమర్లు వినిపించాయి.

అలా గతంలో ఫిబ్రవరి 26 న పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ రాగా...తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవ్వడంతో పాటు విజయ్ దేవరకొండ పెళ్లి రేపే అంటూ ఆ అమ్మాయిలు మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. అందులో రాజస్థాన్లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి రేపే జరగబోతుంది అని పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ఓ ఇద్దరు అమ్మాయిలు వీడియో రిలీజ్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరి చూడాలి విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు పెళ్లి కూడా రహస్యంగా చేసుకుంటారా లేక అందరికీ చెప్పే చేసుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: