తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న ఆర్జే కాజల్ ఒక వీడియోని షేర్ చేస్తు బిగ్ బాస్ సెలబ్రిటీలను జనాలు వాళ్లను సెలబ్రిటీలు గానే పిలుస్తారు.. కానీ బిగ్ బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవచ్చు. ఎటువంటి చోటుకు వెళ్లిన మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతారు. దాని వల్ల చాలా ఇబ్బంది పడుతూనే ఏమీ లేదని సమాధానం ఇస్తుంటాం. ఇదంతా కూడా బద్ధకమో ?టాలెంట్ లేకనో కాదు అవకాశాలు రాక అంటూ చెప్పుకోస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన తర్వాత ఇక బిజీగా ఫుల్ వర్క్ ఉంటుందని అందరూ అనుకుంటారు.. కేవలం అది మూడు నాలుగు నెలల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపింది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వస్తే డిప్రెషన్ పెరిగిపోతుంది అంతకుముందు చేస్తున్న పనిని కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేము, కెరియర్లో ఎదగలేక ముందుకు వెళ్లలేక సతమతమవుతుంటామని తెలిపింది. ఇక యాక్టర్స్ పరిస్థితి హౌస్ లోకి వెళితే.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హౌస్ లో నిన్ను చాలామంది చూశారు, కాబట్టి కొత్త ముఖాలు కావాలని మొహం మీద చెప్పేస్తారు.అందుకే ప్రధాన పాత్రల కోసం ఇతరులను ఎక్కువగా సంప్రదిస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల వల్ల కొంతమంది తక్కువ డబ్బులు ఇచ్చినా కాదనలేక కొన్ని పాత్రలు చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది. మరిన్ని విషయాలను చెప్పుకొచ్చింది ఆర్జే కాజల్. అంతేకాకుండా బిగ్బాస్ వల్ల ఏదీ మారదు. కేవలం అది ఒక రియాలిటీ షో అంటూ తెలియజేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి