నాని ఇటీవలే మరో సినిమాని ప్రకటించి షాకిచ్చాడు. ఈ సినిమా టైటిల్ బాపు జంధ్యాల మార్కులో పెద్ద వంశీ ఎంపికలా ఆకట్టుకుంది. `అంటే సుందరానికీ!` అంటూ ఆశ్చర్యార్థకంతో టైటిలే ఎంతో ఫన్నీగా ఆకర్షిస్తోంది. బాపు-రమణల రైటింగ్ టింజుతో పెద్ద వంశీ ఐడియాలజీతో జంధ్యాల రేంజులో ఈ సినిమాని తెరకెక్కిస్తారా? అన్న సందేహం కలగక మానదు తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ వీక్షిస్తుంటే. డీసెన్సీ లేక ఇటీవల ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన కామెడీ అంతరించినట్టయ్యింది. దీంతో అలాంటి సినిమా చూడాలనుకునే ఔత్సాహికులకు సరైన అవకాశమే లేకుండా పోయింది. సడెన్ గా నాని ప్రత్యక్షమై ఈ పోస్టర్ తో పాత జ్ఞాపకాల్ని తిరగతోడారు. తాజా పోస్టర్ చూస్తుంటే ఆ రేంజు ఉంటుందని అంచనా వేస్తున్నారు.