శర్వానంద్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటిలో ‘శ్రీకారం’ షూటింగ్ చివరి దశలో ఉంది. కిశోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక "ఆర్ ఎక్స్ 100" దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న చిత్రం ‘మహా సముద్రం’ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, అను ఇమ్మానుయేల్, అదితిరావు హైదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, శర్వా చేతిలో ఉన్న మరో సినిమా ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’.  రష్మిక మందన హీరోయిన్. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.ఖచ్చితంగా శర్వానంద్ ఈ సినిమాలతో గొప్ప హీరో అవ్వడం ఖాయమని చాలా నమ్మకంగా వున్నాడట.