రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనేది ఇంకా సస్పెన్సు లోనే ఉంది. తోటి హీరో ఎన్టీఆర్ ఇప్పటికే RRR తర్వాత చేయబోయే సినిమాలను అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ని చేసేందుకు ఎన్టీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఏ సినిమాలో నటిస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వెంకీ కుడుముల, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి వంటి కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఎందుకో ఆ సినిమా లు ఇంకా ఫైనలైజ్ కాలేదు..