ఒక పత్రికలో రాజా ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్త ప్రచురించారు ఆ మధ్య కాలంలో. రాజా సోదరి ఆ పత్రిక పట్టుకుని రాజా దగ్గరకు వచ్చారట.నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని రాశారు అని చెప్పారట. దానికి రాజా ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్నాను..  అప్పుడే వార్త వచ్చిందా అని ఆమెతో అన్నారట. తరువాత సదరు పత్రికకు ఫోన్ చేసి నేను బ్రతికే ఉన్నాను అంటూ చెప్పుకున్నారు రాజా. తరువాత ఆ పత్రిక మరునాడు రాజా ఆత్మహత్య వార్త పొరపాటున ప్రచురించాం అని పత్రికలో రాసుకొచ్చింది.